హీరో కార్తికేయ గుమ్మకొండ, దర్శకుడు అజయ్ భూపతి మరోసారి జతకట్టనున్నారు. వీరిద్దరూ గతంలో RX 100 సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడులాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా చేయబోతున్నారు ఈ ఇద్దరు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోతుంది.
నిజానికి కెరీర్ పరంగా ఈ ఇద్దరికీ ఇది ముఖ్యమైన సినిమా. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.