అభ్యర్థుల గుర్తులు మారిపోవడంతో పోలింగ్ నిలిచిపోయిన ఓల్డ్ మలక్‌పేటలో రిపోలింగ్ కొనసాగుతోంది. 69 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. సాధారణ షెడ్యూల్ ప్రకారమే సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ రీపోలింగ్ కోసం మొత్తం 276 మంది అధికారులు పోలింగ్ విధుల్లో ఉన్నారు. 54 వేల 502 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలు జరగ్గా.. ఓల్డ్ మలక్‌పేటలో బ్యాలెట్ పేపర్లలో కంకి కొడవలి బదులు సుత్తి కొడవలి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎన్నికల కమిషన్ పోలింగ్ నిలిపివేసింది. పోలింగ్ నిలిపివేసేసరికే 3450 మంది ఓటు వేశారు.