రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ లో గ్యాస్ పంపిణీ కేంద్రాలను మూసి వేస్తున్నారు. ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 16 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను గ్యాస్ సరఫరా వ్యవస్థ నిర్వాహకులు మూసి వేశారు.
‘ రష్యా దాడుల నేపథ్యంలో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను మూసి వేయాలని నిర్ణయించాము. ఈ మేరకు ఖార్కివ్, మైకోలెయివ్, జపోరిజజియా, కీవ్ లలో 16 గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను మూసి వేశామని నిర్వహకులు తెలిపారు” అని కైవ్ ఇండిపెండెంట్ ట్వీట్ చేసింది.
రష్యా- ఉక్రెయిన్ ల మధ్య మూడో విడత చర్చలు సోమవారం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వార్తను రష్యన్ మీడియా ఏజెన్సీ ప్రచురించింది.
ఉక్రెయిన్ మీడియాలో వచ్చిన వార్తను ఊటంకిస్తూ… రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య చర్చలు సోమవారం జరగే అవకాశం ఉంది. చర్చలకు తేదీని ఉక్రెయిన్ సూచించగా దీనిపై రష్య ఇప్పటి వరకు స్పందించలేదు.