భారీ వర్షాలను కవర్ చేసేందుకు వెళ్లి జగిత్యాల జిల్లా రామోజీపేట వాగులో గల్లంతైన రిపోర్టర్ జమీల్ మరణించారు. జమీర్ కారును రామోజీపేట భూపతిపూర్ లో గుర్తించి అధికారులు బయటకు తీశారు. అక్కడికి కొద్ది దూరంలో చెట్ల కొమ్మల్లో చిక్కుకుని ఉన్న జమీర్ మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు గుర్తించాయి. జమీర్ మృత దేహాన్ని శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో న్యూస్ సేకరణ కోసం రిపోర్టర్ జమీల్ మూడు రోజుల క్రితం కారులో బయలు దేరారు. న్యూస్ కవరేజ్ చేస్తుండగా అతనికి కుటుంబ సభ్యుల నుంచి ఓ వార్త అందింది. దీంతో ఆయన తన కారులో తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ క్రమంలో రాయికల్ మండలం రామెజీపేట- భూపతిపూర్ గ్రామాల వద్ద భారీగా పొంగిపొర్లుతున్న వాగులో జమీల్ కారు కొట్టుకు పోయింది. సమాచారం అందుకున్న అధికారులు వాగు దగ్గరకు చేరుకున్నారు. వెంటనే రెస్క్యూ బృందాలను రంగంలోకి దించి జమీర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం జమీర్ మృత దేహాన్ని రెస్య్కూ టీమ్ వెలికి తీసింది. చెట్టు కొమ్మకు చిక్కుకుని జమీర్ మృతదేహం కనిపించగా రెస్క్యూ సిబ్బంది దాన్ని బయటకు తీశారు. జమీర్ మరణ వార్తతో ఆయన కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.