సంక్రాంతి పండగకు పతంగుల సందడి కొత్తకాదు. వీటిని పేపర్ తోనో, పాలథీన్ రేపర్ తోనో తయారు చేసి పిల్లలు పెద్దలు సరదాగా ఎగురు వేస్తుంటారు. కానీ ఉత్తర్ ప్రదేశ్ స్వర్ణకారులు బంగారు పతంగాన్ని తయారు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు.
మేరఠ్ నగరంలోని స్వర్ణకారులు ఈ స్వర్ణపతంగాన్ని రూపొందించారు. అయితే ఈ నెల 26న వసంత పంచమి సందర్భంగా ఈ బంగారు పతంగిని తయారు చేసినట్లు స్వర్ణకారులు అంకుర్ జైన్, రితేశ్ జైన్ తెలిపారు. కేవలం పతంగే కాదు.. దాన్ని ఎగరవేసేందుకు దారాన్ని కూడా బంగారంతోనే చేయడం అందర్నీ ఆకర్షిస్తోంది.
దీని విలువ రూ.25 లక్షలు ఉంటుందని స్వర్ణకారులు పేర్కొన్నారు. 16 మంది కలిసి, 16 రోజుల పాటు కష్టపడి తయారు చేసినట్లు వెల్లడించారు. దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వారు తెలిపారు.
సాధారణంగా వసంత పంచమి రోజు పతంగులను ఎగురవేస్తారు. కానీ ఆ రోజు రిపబ్లిక్ డే ఉన్న నేపథ్యంలో గాలిపటాలను ఎగర వేయకూడదని నిర్ణయించుకున్నట్లు స్వర్ణకారులు చెబుతున్నారు.