ఢిల్లీలో 73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్ పథ్ లో ఆయనకు సాయుధ దళాలు 21 తుపాకులతో వందనం సమర్పించాయి.
రాష్ట్రపతితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు రాజ్ పథ్ కు సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర అమర జవాన్లకు ప్రధాని నివాళులు అర్పించారు.
కరోనా కారణంగా ఈసారి వీక్షకుల సంఖ్యను కుదించారు అధికారులు. సైనిక దళాల పరేడ్ ను రాష్ట్రపతి వీక్షించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పరేడ్ లో నాలుగు ఎంఐ-17వీ5 హెలికాప్టర్లు గాల్లో చక్కర్లు కొడుతూ ప్రదర్శన ఇచ్చాయి.
రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలక కూడళ్లలో పోలీసులు వాహనాలను తనిఖీ నిర్వహించారు. దాదాపు 30వేల మందికి పైగా భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో గట్టి చర్యలు తీసుకున్నారు.