సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఎప్పుడో రిలీజ్ కావల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు అక్టోబర్ 1న విడుదల కాబోతుంది అని చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన వచ్చింది. కాగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్.
ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఇదిలా ఉండగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.