సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేవకట్ట దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ సినిమా ఏలూరు సమీపంలో ఉండే కొల్లేరు సరస్సు కు సంబంధించిన వివాదాస్పద కాన్సెప్టుతో సాగనుందని కలెక్టర్ గా పనిచేస్తున్న సాయిధరమ్ తేజ్ ఆ సమస్య పై పోరాటం చేస్తూ కనిపిస్తాడని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
ఇక కలెక్టర్ గా ఉన్న సాయి ధరమ్ తేజ్ ఒక ముఖ్యమంత్రితో కూడా ఫైట్ చేయబోతున్నారట. కాగా ముఖ్యమంత్రిగా సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారట. అదే విధంగా ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.