RTGS సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి 24 గంటలపాటూ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. అర్ధరాత్రి 12.30నిమిషాల నుంచి ఆర్టీజీఎస్ సేవలు మొదలవుతాయని తెలిపింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే పనిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది.
ఇన్నాళ్లు ఆర్టీజీఎస్ సేవలు.. కేవలం పనిదినాల్లో అది కూడా కేవలం ఉదయం 7గం.ల నుంచి సాయంత్రం 6గం.ల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తాజా నిర్ణయంతో 24 గంటలపాటు ఎప్పుడైనా చెల్లింపులు చేయొచ్చు.కాగా ఆర్టీజీఎస్‌ను అధిక మొత్తంలో నగదు బదిలీ చేసేందుకు ఉపయోగిస్తుంటారు. నెఫ్ట్ ద్వారా కేవలం రూ.2 లక్షలలోపు మాత్రమే నగదు బదిలీకి చాన్స్ ఉంది.