భారత-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాల మాట ఎలా ఉన్నా.. ఇండియన్ టీమ్ నుంచి తాము గౌరవాన్ని కోరుతున్నామని, కానీ ఈ మధ్య తమ దేశాన్ని భారత క్రికెటర్లు గౌరవిస్తున్నారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ జట్టు ‘బిలియన్ డాలర్ సైడ్’ అని ఎద్దేవా చేశాడు. . ఆయన చేసిన ఈ కామెంట్స్ మీద మీ స్పందన ఏమిటని స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ని ప్రశ్నించినప్పుడు తీవ్రంగా స్పందించాడు.
రమీజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు తాను మీడియా ద్వారానే తెలుసుకుంటున్నానన్నాడు. కానీ క్రికెట్ అన్నాక రెండు దేశాల మధ్య రాజకీయ ఒత్తిడులు ఉన్నప్పటికీ వీటిని తాము పట్టించుకోబోమన్నాడు. ప్రత్యర్థి దేశాల మధ్య విరోధం ఉండవచ్చునని, ఆట అన్నాక గెలుపు ఓటములు సహజమేనని వ్యాఖ్యానించాడు. మేము పాకిస్థాన్ ని గౌరవించినప్పుడు వాళ్ళు కూడా ఇండియాను గౌరవించాల్సిందే అని తీవ్రంగా పేర్కొన్నాడు.
అనేకమంది క్రికెట్ మ్యాచ్ చూడడానికి వస్తారని, కానీ రోజంతా అయ్యాక ఎవరైనా క్రికెట్ గురించే మాట్లాడుకుంటారని చెప్పాడు. ఎవరు ఓడారు. ఎవరు గెలిచారు అన్నది గేమ్ లో ఒక భాగం అన్నాడు.
రమీజ్ రాజా ఇటీవల డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. భారత జట్టు గురించి హేళనగా మాట్లాడాడు. ఒకప్పుడు పాకిస్థాన్ జట్టును ‘అండర్ డాగ్స్’ గా పరిగణించేవారని, కానీ ఈ మధ్య కాలంలో భారత ప్లేయర్లు తమ దేశాన్ని గౌరవించడం ప్రారంభించారని అన్నాడు. ఇందుకు కారణం వారికన్నా మేం ఒక మెట్టు పై స్థాయిలో ఉండడమే అని చెప్పాడు. . ఏమైనప్పటికీ.. క్రికెట్ చరిత్రలో ‘ఒక బిలియన్ డాలర్’ జట్టును మేం ఓడించగలం అని వ్యాఖ్యానించాడు. ఇండియాతో పోలిస్తే తమ దేశానికి పరిమితంగా వనరులు ఉన్నాయని అయినప్పటికీ సంసిద్ధమై పోరాడుతూనే ఉంటామని రమీజ్ అన్నాడు.