పాముల్లో నాగుపాము చాలా ప్రమాదకరమైనది. అది చాలా ఈజీగా పడగవిప్పగలదు. అందులో ముఖ్యంగా ఇండియన్ కోబ్రా… ఇది మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ఇది మనుషులకు హాని చెయ్యదు గానీ… కాటు వేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. తాజాగా ఇలాంటి పొడవైన ఓ నాగు పాము ఒకటి కంటపడింది. అది ఏకంగా 12 అడుగుల పొడవు ఉంది. అంత పెద్ద పాము కనిపిస్తే ఎవరైనా సరే భయపడతారు. ఐతే ఇలాంటి పాముల్ని పట్టుకోవడానికి కొంత మంది ట్రైనింగ్ తీసుకుంటారు. వారికి వాటిని ఎలా పట్టుకోవాలో బాగా తెలుసు. ఒక్కోసారి ఎంత ట్రైనింగ్ తీసుకున్న వారైనా సరే ఆ పాము కాటుతో చనిపోతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి.
ఎందుకంటే ఆ పాములు చాలా సడెన్‌గా స్పందిస్తాయి. రెప్పపాటులోనే కాటువేస్తాయి. ఆ పామును పట్టుకునేలోపే.. వాటి విషం కాటేసిన బాడీలోకి వెళ్లిపోతుంది.ఇక ఈ 12 అడుగుల కోబ్రా మాత్రం చూస్తుంటే చాలా కోపంగా ఉంది. అది రెస్క్యూ టీమ్ వారిని సైతం తెగ ఇబ్బంది పెట్టింది. అంత ఈజీగా ఆ పాము లొంగలేదు. ఎలాగైనా సరే అక్కడ నుంచి పారిపోవాలని ప్రయత్నించింది. మొత్తానికి అతి కష్టమ్మీద దాన్ని ఎలాగోలా పట్టుకున్నారు. ఇక ట్విట్టర్‌లోని @Animal_WorId అకౌంట్‌లో ఆ వీడియోని పోస్ట్ చేశారు.ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతుంది.
— عالم الحيوان (@Animal_WorId) November 30, 2021
Advertisements