చిన్నప్పటి నుంచే మనకు స్కూళ్లలో గ్రామర్ పాఠాలు చెబుతారు. హిందీ, ఇంగ్లిష్, తెలుగు.. ఇలా మనం చదివే భాషలను బట్టి వ్యాకరణం బోధిస్తారు. దాన్ని తప్పకుండా నేర్చుకోవాలి. ముఖ్యంగా పంక్చువేషన్ లను సరిగ్గా పాటించాలి. లేదంటే కొన్ని సార్లు పదాలు, వాక్యాల అర్థాలే మారిపోతాయి. సరిగ్గా ఆ రెస్టారెంట్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తమ రెస్టారెంట్ పేరులో ఒక చోట అపాస్ట్రఫిని పెట్టలేదు. దీంతో ఆ రెస్టారెంట్ పేరు అర్థమే మారిపోయింది. ఈ క్రమంలో ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. సదరు రెస్టారెంట్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
లండన్‌లోని బేసింగ్‌స్టోక్‌లో అనూస్ కిచెన్ అని ఓ ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అయితే ఆ రెస్టారెంట్ పేరులో అను అన్న తరువాత అపాస్ట్రఫి రావాలి. తరువాత ఆంగ్ల అక్షరం ఎస్ రావాలి. అంటే Anu’s అని ఉండాలి. కానీ వారు అపాస్ట్రఫి పెట్టడం మరిచిపోయారు. దీంతో ఆ పేరు కాస్తా Anus అయ్యింది. దాన్నే ఆ రెస్టారెంట్‌కు చెందిన కరపత్రాలపై ముద్రించారు. ఈ క్రమంలో ఆ పాంప్లెట్‌ను ఫొటో తీసిన కొందరు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Anu’s kitchen. Remember, punctuation is important!! pic.twitter.com/x5h6kaUfVZ
— marty 🏴🇬🇧 (@martymitch_) November 20, 2020
కాగా ఆ పాంప్టెల్ ఫొటోను ముందుగా ఫేస్‌బుక్‌లో పౌల్ బ్రూక్ అనే వ్యక్తి షేర్ చేశాడు. దానికి Why punctuation is important అని కామెంట్ పెట్టాడు. చిన్నతనంలోనే మనం గ్రామర్ పాఠాలు నేర్చుకుంటాం. పంక్చువేషన్ ఎక్కడ పెట్టాలి అనే వివరాలను కూడా తెలుసుకుంటాం. వాటిని మరిచిపోతే ఇదిగో ఇలాంటి మిస్టేక్‌లే జరుగుతాయి. అన్నట్లుగా అతను ఆ కామెంట్‌ను పెట్టాడు. అయితే ఆ పాంప్లెట్ ఫొటో ఫేస్ బుక్‌తోపాటు ట్విట్టర్‌లోనూ వైరల్ అవుతోంది. చాలా మంది దాన్ని చూసి నవ్వుకుంటున్నారు. దానిపై జోకులు పేల్చడమే కాక.. ఆ రెస్టారెంట్ ఆ మిస్టేక్‌ను కూడా చూసుకోకపోవడంపై వారిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆ పోస్టులకు విపరీతంగా లైక్‌లు కూడా వస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఆ రెస్టారెంట్ వారు మిస్టేక్‌ను సరిదిద్దుకుంటారో లేదో చూడాలి.