కొణిదెల నిహారిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెర యాంకర్ గా పరిచయమైన నిహారిక హీరోయిన్ గా కూడా నటించింది. ఆ సినిమా ఆకట్టుకోలేకపోవడంతో ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఇకపోతే అల్లరిగా తిరిగే నిహారిక ఒక్క సంఘటనతో సైలెంట్ అయిపోయింది. ఇటీవల డ్రగ్స్ కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది నిహారిక.
ఈ కేసులో ఆమెకు సంబంధం ఉందా లేదా అనేది పక్కనపెడితే తన ఫ్రీడమ్ ను మాత్రం కోల్పోయిందని తెలుస్తోంది. ఈ ఘటన జరుగక ముందు నిహారిక ఆడిందే ఆట పాడిందే పాట అనేలా ఉండేది. మెగా ఫ్యామిలీ సైతం హారికకు ఫ్రీడమ్ ఇచ్చేవారు. హీరోయిన్ అవుతానన్నపుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నో చెప్పలేదు. ఆ తర్వాత వెబ్ సిరీస్ ల వైపు వెళ్ళింది. అక్కడ కూడా నిహారిక ఇష్టానికే వదిలేశారు.
ALSO READ : కే జి ఎఫ్2 వెనుక 19ఏళ్ళ కుర్రాడి పాత్ర
అత్త ఇంట్లో కూడా నిహారికకు స్వేచ్ఛ దొరికింది. ఈ విషయాన్ని స్వయంగా నిహారిక సోషల్ మీడియా వేదిక చెప్పారు. ఇకపోతే గతంలో జిమ్ ట్రైనర్ తో నిహారిక చనువుగా ఉండేది. అందుకు సంబంధించిన వీడియో లు కూడా వైరల్ అయ్యాయి. ఈ విషయంలోనే నిహారిక ను మందలించారట అత్తంటివారు. ఈ కారణం తోనే నిహారిక ఇంస్టాగ్రామ్ డిలీట్ చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఎక్కడా కూడా క్లారిటీ లేదు.
అది జరిగిన కొన్ని రోజులకే ఈ డ్రగ్స్ సంఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ విషయం బయటకు వచ్చిన తర్వాత నాగబాబు ఓ వీడియోని రిలీజ్ చేశారు. నిహారిక కు ఏ పాపం తెలియదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది విన్న చాలా మంది అర్ధ రాత్రి మూడు గంటల వరకు భర్త లేకుండా ఒక మహిళకు పబ్ లో ఏం పని అంటూ ప్రశ్నిస్తున్నారు.
ALSO READ : మనం నడుపుతున్న కారు మీద Lxi, vdi, LDi ,ZDi గమనించారా ? అర్ధం తెలుసా !!
నిహారికకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే ఇదంతా జరిగిందని మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇంట్లో ఆంక్షలు విధించారట. ప్రస్తుతం ఇంట్లో నుంచి బయటకు ఎక్కడికి వెళ్లడం లేదట నిహారిక. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తన స్వేచ్ఛను తానే చేజేతులా పోగొట్టుకుందని చెప్పాలి.