తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద రాయల్ వశిష్ఠ బోటు వెలికితీత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం బోటుకు సంబందించిన రైలింగ్ దొరకటంతో బోటు వెలికితీత పనులను వేగవంతం చేశారు సత్యం బృందం సభ్యులు. ఇప్పటికే బోటు ఉన్న స్థలాన్ని గుర్తించి, బయటకు తీయటానికి లంగరులను వేస్తున్నారు. మరోవైపు గోదావరి నీటి మట్టం కూడా క్రమేపి తగ్గటంతో ఇంకా సులువుగా వశిష్ఠ బోటును తీసే అవకాశం కనిపిస్తుంది. కాకినాడ నుంచి వచ్చిన పోర్ట్ అధికారి ఆదినారాయణ సూచనల మేరకు లంగర్లను వేస్తున్నారు. దాదాపుగా 50 అడగల లోతులో బోటు ఉన్నట్లు కూడా వాళ్ళు గుర్తించారు.