ఒక్క ఫోన్ కాల్.. ఆయన జీవితాన్ని మార్చేయబోతుందా? పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇన్నాళ్లు గుట్టుగా లాగిన లాబీయింగ్.. ఇప్పుడు ఆ ఫోన్ కాల్ తో బట్టబయలు అయిపోవడంతో పాటు.. ఆయన వేయించిన ఓ రిట్ పిటిషన్ లో.. పెద్ద మలుపే చోటు చేసుకుంది. కొత్తగా ఇంప్లీడ్ అయిన పిటిషన్ తో.. ఇప్పుడా కేసులోకి.. పెద్దాయన ఎక్కక తప్పేట్లు లేదు. హైకోర్టుపైనే గురి పెట్టిన పెద్దమనిషి.. ఇప్పుడు బోనెక్కడం తప్పదేమో అనిపిస్తోంది.
జస్టిస్ ఈశ్వరయ్య.. రిటైర్డ్ జడ్జి.. పైగా జగన్ సర్కార్ లో ఎడ్యుకేషన్ హై లెవెల్ కమిటీ ఛైర్మన్ గా కూడా నామినేట్ అయ్యారు. అయితే సారు.. మరో జడ్జి రామకృష్ణకు జగన్ సర్కార్ తరపున లాబీయింగ్ చేయడానికి ఫోన్ చేయటం.. ఆ కాల్ రికార్డును రామకృష్ణ లీక్ చేయడంతో .. న్యాయస్థానాలతో ఆడాలని ప్రయత్నిస్తున్న.. ప్రయత్నించిన పెద్ద యవ్వారమంతా బయటపడింది. అదే ఫోన్ కాల్ లో ఈశ్వరయ్యగారు.. హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరికి వ్యతిరేకంగా బీసీ ఫౌండేషన్ పేరుతో పిటిషన్ వేయించింది తానేనని గర్వంగా ప్రకటించారు. ఇప్పుడదే ఆయన కొంప ముంచబోతుందా అని డౌట్ వస్తోంది.
ఎందుకంటే అదే పిటిషన్ లో విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. అయితే జస్టిస్ రామకృష్ణ దానిలో ఇంప్లీడ్ అయి.. కొత్త విషయాలు తెలియచేశారు.. కొత్త విషయాలంటే బహుశా ఈశ్వరయ్యగారి పాత్ర మీద.. ఆ ఫోన్ కాల్ రికార్డుతో సహా జత చేసి ఇచ్చుంటారు. దీంతో హైకోర్టు ఆ పిటిషన్ పునర్విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారి తెర వెనుక పాత్రను కూడా విచారిస్తారా అనే అనుమానం వస్తోంది. అదే జరిగితే.. ఆ తీగంతా లాగాల్సి వస్తోంది.. అప్పుడు డొంక కూడా కదిలే అవకాశం ఉంది.
మరోవైపు జస్టిస్ రామకృష్ణ మరో బాంబు పేల్చారు. మొద్దు శీను హత్య కేసులో నిజాలను తొక్కిపెట్టారని.. అప్పుడు లోకల్ కోర్టు జడ్జిగా తానిచ్చిన నివేదికను తొక్కిపెట్టి.. ఈశ్వరయ్య ఓంప్రకాష్ కు శిక్ష పడేలా చేశారని ఆరోపించారు. మొద్దు శీను చంపింది పరిటాల రవిని.. అప్పట్లో ఆ హత్య కేసులో అనుమానితులుగా జేసీ బ్రదర్స్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లు వినపడ్డాయి. ఎందుకంటే లోకల్ గా పరిటాలకు జేసీ బ్రదర్స్ ప్రత్యర్ధులు… రియల్ ఎస్టేట్ లో అటు హైదరాబాద్ గాని, ఇటు బెంగళూరు గాని జగనే ప్రత్యర్ధి. అందుకే ఆ పేర్లు వచ్చాయి. అప్పట్లో మొద్దు శీను జైల్లో చంపివేయబడటం సంచలనం రేపింది. ఇప్పుడు రామకృష్ణ చెప్పిన సంగతులు మరింత సంచలనాత్మకంగా మారాయి.
ఇప్పుడు మొద్దుశీను హత్య కేసు కూడా రివోక్ అయితే మాత్రం.. కథ వేరేగా ఉంటుంది. మరి లీగల్ గా దానిపై జస్టిస్ రామకృష్ణ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో వేచి చూడాలి మరి. ఇప్పటికైతే హైకోర్టునే కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించాలన్న పిటిషన్ పునర్విచారణతో జస్టిస్ ఈశ్వరయ్య ఇరుకున పడటం ఖాయం. ఆయన ఫోన్ చేసి మాట్లాడటం ఒక తప్పయితే.. అందులో తానే పిటిషన్ వేయించానని చెప్పడం.. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి.. ఫోన్ లో మాట్లాడింది తానేనని ఒప్పుకోవడం.. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి.. వరుస తప్పులు చేసుకుంటూ.. ఇప్పుడు హైకోర్టు ముందు నిలబడక తప్పదేమో అనిపిస్తోంది.