పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను కేంద్రం నియమించింది. ఏపీ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను స్థాన చలనం కలిగింది. ఆయన్ని ఛత్తీస్ గడ్ గవర్నర్ గా కేంద్రం బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను రాష్ట్రానికి పంపించింది.
ఆయన గతంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 2017లో ఆయనకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. గతంలో పలు చారిత్రాత్మక కేసులను విచారించిన ధర్మాసనాల్లో అబ్దుల్ నజీర్ సభ్యులుగా ఉన్నారు.
ఆయన పుట్టు స్వామి కేసు(గోప్యత ప్రాథమిక హక్కు). ట్రిపుల్ తలాక్, అయోధ్య బాబ్రీ మసీదు వివాదం, డీమానిటైజేషన్ కేసులను విచారించిన ధర్మాసనల్లో ఆయన న్యాయమూర్తిగా ఉన్నారు. గతంలో పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను గవర్నర్లుగా నియమించారు.
అంతకు ముందు 2014లో మాజీ సీజేఐ జస్టిస్ సదాశివంను కేరళ గవర్నర్ గా అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఫాతీమా బీబీని 1992లో పదవీ విరమణ చేశారు. ఆమెను 1997-98లో తమిళనాడు గవర్నర్ గా నియమించారు.