సోషల్ మీడియాలో వైరల్ అయిన ఉత్తరాఖండ్ యువకుడి వీడియోపై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా స్పందించారు. నిర్మాత వినోద్ కప్రి ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. అతనికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
రిక్రూట్ మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో సాయం చేస్తానన్నారు దువా. తాను ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రాణా కలితాతో మాట్లాడానని.. అతను తన రెజిమెంట్ లో రిక్రూట్ మెంట్ కోసం ఆ యువకుడికి శిక్షణ ఇస్తారని తెలిపారు. సతీష్ దువా స్పందనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నోయిడా రోడ్లపై ప్రదీప్ మెహ్రా అనే 19 ఏళ్ల యువకుడు వేగంగా పరుగెడుతూ నిర్మాత కప్రి కంటపడ్డాడు. లిఫ్ట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. దానికి ఆ యువకుడు సున్నితంగా తిరస్కరించాడు. తాను ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుంటున్నానని.. అందుకే షిఫ్ట్ కంప్లీట్ అయ్యాక ఆఫీస్ నుంచి ఇంటికి రోజు 10 కిలోమీటర్లు పరుగెత్తుతున్నానని బదులిచ్చాడు.
ఉదయం ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా అని ఆ యువకుడిని వినోద్ ప్రశ్నించగా.. తాను 8 గంటలకు లేచి వంట చేయాలని, మిగతా సమయాల్లో ప్రాక్టీస్ వీలుకాదని తెలిపాడు. అందుకే ఈ సమయాన్ని ఎంచుకున్నట్టు చెప్పాడు. మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారని అడగ్గా.. తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని తెలిపాడు. ఇంతలో తాను ఇంటికి వెళ్లి వంట చేయాలన్న విషయాన్ని ప్రదీప్ చెప్పగా.. పదా డిన్నర్ చేద్దామని వినోద్ ఆఫర్ చేశాడు. దానికి తన తమ్ముడు ఇంటి వద్ద ఉన్నాడని.. అతనికి తానే అన్నం వండి పెట్టాలని అందుకే రాలేనని బదులిచ్చాడు.
This is PURE GOLD❤️❤️
नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया
मैंने सोचा
किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिएबार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया
वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊 pic.twitter.com/kjBcLS5CQu
— Vinod Kapri (@vinodkapri) March 20, 2022
ప్రదీప్ తో జరిగిన సంభాషణ మొత్తాన్ని వినోద్ వీడియో తీసి ట్వీట్ చేశాడు. ఈ యువకుడు ఎంతోమందికి స్ఫూర్తి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. పోస్ట్ చేసిన క్షణాల్లోనే ఈ వార్త వైరల్ అయింది. ప్రదీప్ మాటలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా స్పందించి సాయం చేస్తానని తెలిపారు.
His Josh is commendable, and to help him pass the recruitment tests on his merit, I've interacted with Colonel of KUMAON Regiment, Lt Gen Rana Kalita, the Eastern Army Commander. He is doing the needful to train the boy for recruitment into his Regiment.
Jai Hind 🇮🇳 https://t.co/iasbkQvvII— Lt Gen Satish Dua🇮🇳 (@TheSatishDua) March 21, 2022
Advertisements