రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ ఫ్యామిలీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఆయన తమ్ముడు రాజశేఖర్ పై భార్య గృహహింస కేసు పెట్టడం.. అతను కనిపించకపోవడంతో తెరపైకి అనేక అనుమానాలు వస్తున్నాయి. రాజశేఖర్ తనను రోజూ గొడ్డును బాదినట్టు బాదుతున్నాడని భార్య పోలీసులను ఆశ్రయించింది. వీడియో తీసి ఆధారాలతో సహా కేసు పెట్టింది. తనపై దాడిలో అతడి తల్లిదండ్రులు పెనుమాక సుబ్బారావు, మణి, సోదరి అరుణ ప్రోత్సాహం ఉందని వారి పేర్లను కూడా కేసులో చేర్చింది.
ఈ గృహహింస కేసులో ప్రాథమిక విచారణకు హాజరుకావాలని నోటీస్ ఇవ్వడానికి విజయవాడ పటమట పోలీసులు రాజశేఖర్ ఇంటికి వెళ్లారు. కానీ.. తాళం వేసి ఉంది. ఈ నేపథ్యంలో పీవీ రమేష్ ఫ్యామిలీ నేర చరిత్రపై చర్చ జరుగుతోంది. పీవీపై ఫైబర్ నెట్ కేసులో తీవ్ర అభియోగాలు ఉన్నాయి. సిట్ దర్యాప్తు చేస్తున్న ఈ స్కాంలో ఆయన ప్రధాన పాత్రధారి అనే ఆరోపణలున్నాయి. అలాగే ఆయన సోదరుడు మూడేళ్ల క్రితం ఒక అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. లైంగిక వేధింపులకు పాల్పడితే అతడి ఆఫీస్ పై దాడి జరిగింది.
ఇలా పీవీ కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక క్రిమనల్ కేసులో ఇరుక్కున్నారు. అయితే.. వీరంతా తప్పు తమది కాదని బుకాయిస్తూ.. వేరే వాళ్ల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు బాధితులు. పీవీ రమేష్ ను ఆర్థిక నేరం చేయమని ఎవరు చెప్పారు? ఆయన ఒక స్కాంలో ఇరుక్కుని.. ఎవరూ విచారించకూడదని చెప్పడం ఎంత వరకు కరెక్ట్? ఇప్పుడు పోలీసులు నోటీసు ఇవ్వడానికి వెళితే అరెస్ట్ చేయడానికి వచ్చారని ప్రచారం చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఒక సోదరుడు లైంగిక వేధింపులకు దిగి దొరికిపోతే ఎవరు బాధ్యులు? మరో సోదరుడు భార్యను కొడితే ఎవరు బాధ్యులు? ఇంత చేస్తే కేసులు పెట్టకుండా ఉంటారా? అని మండిపడుతున్నారు బాధితులు. పెనుమాక సుబ్బారావు కుటుంబంలో ఏకంగా ఇద్దరి పిల్లల కాపురాలు కోర్టుల్లో ఉన్నాయి. దీన్నిబట్టి వారితో వియ్యం అందుకున్న వాళ్లు ఎంత నష్టపోయి ఉంటారో ఆలోచించాలనే రాజశేఖర్ భార్య అంటోంది. పైగా నోటీసులు ఇవ్వడానికి ఎవరైనా వస్తే బెదిరింపులకు దిగటం.. పరారయి ఎవరో ఎత్తుకు పోయారని దబాయించడంపై మండిపడుతోంది. పైగా అదృశ్యం, కలకలం అంటూ కొన్ని ఛానల్స్ లో రావడంపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.