ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అబ్దుల్ నజీర్ ని నియమించారు. అయితే పదవీ విరమణ చేసిన ఓ న్యాయమూర్తిని రాజ్యాంగ బద్దమైన పోస్టులో నియమించడానికి ముందు కనీసం ఓ ఏడాదైనా ‘విశ్రాంతి’ ఇచ్చి ఉండవచ్చు కదా అన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి.
అయోధ్య తీర్పు విషయంలో ఏకాభిప్రాయం వక్తం చేసిన బెంచ్ లో ఆయన కూడా ఒకరు.
నాడు 5 గురు జడ్జీలతో కూడిన ధర్మాసనంలో ఒకరైన ఈయన..సుమారు నెల రోజుల క్రితమే.. జనవరి 4 న రిటైరయ్యారు. డీమానిటైజేషన్, ట్రిఫుల్ తలాక్ వంటి కీలక కేసులను జస్టిస్ అబ్దుల్ నజీర్ పరిష్కరించారు.
ఇండిపెండెంట్ ఇండియా చరిత్రలో ఇలా రిటైరయ్యాక కీలక గవర్నర్ పదవిని పొందిన వారిలో మూడో వ్యక్తి ఈయన.