నూతిలో మనుషులు! -retired justice noothi ram mohan dowry harrassment sindhu sharma physical abuse cctv videos - Tolivelugu

నూతిలో మనుషులు!

ఎంత చదువు చదివినా, ఎంత గౌరవప్రదమైన ఉద్యోగాలు వెలగబెట్టినా ఇంకా కోడళ్లను బానిసలుగా చూసేవాళ్ళు సమాజంలో ఉన్నారని రూఢీ అవుతూనే వుంది. 

రిటైర్డ్ జస్టిస్ నూతి రామ్ మోహనరావు కోడలు సింధు శర్మ తనను అత్తింటి వాళ్ళు అదనపు కట్నం కోసం ఎలా వేధిస్తున్నారో, మీడియా ముందుకొచ్చి ఎప్పటినుంచో చెప్తూనే వున్నారు. దానికి సంబంధించి హృదయ విదారకమైన వీడియోలను సింధు శర్మ బయటపెట్టారు. తన పిల్లల ముందే తన భర్త వశిష్ట, మామగారు రిటైర్డ్ జస్టిస్ నూతి రామ్ మోహన్, అత్తగారు జయలక్ష్మి తనను ఎలా కొట్టారో ఆ వీడియోలలో ఉందని ఆమె చెప్పారు. తన దగ్గర ఆ వీడియోలు ఎప్పటినుంచో ఉన్నా, ఎలాగైనా భర్తతో, పిల్లలతో కలిసి ఉండాలని, కాంప్రమైజ్ కోసం ప్రయత్నించానని ఆమె అన్నారు.
అయితే, వశిష్ట మాత్రం ఇక విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ 24 కు వాయిదా పడింది.
సీసీటీవీ వీడియోలు చూస్తున్న జనం మాత్రం సింధు శర్మ అనుభవించిన శారీరక, మానసిక బాధను చూసి చలించిపోయారు. అత్తగారు జయలక్ష్మి ఆ వీడియోలలో ఆపినట్టు కనిపించినా, రిటైర్డ్ జస్టిస్ నూతి రామ మోహన్ మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తించాడని వీడియో చూసిన వారికి అర్ధం అవుతుంది

 

Share on facebook
Share on twitter
Share on whatsapp