నాలుగు దశాబ్దాల క్రితం భూమిపై పరిశోధనల కోసం ఈఆర్పీఎస్(ఎర్త్ రేడియేషన్ బడ్జెట్ శాటిలైట్)ను నాసా ప్రయోగించింది. తాజాగా 38 ఏండ్ల తర్వాత ఆ శాటిలైట్ రిటైర్ కానుంది. త్వరలోనే ఆ శాటిలైట్ భూ కక్ష్యలోకి ప్రవేశించనున్నట్టు నాసా వర్గాలు వెల్లడించాయి.
ఈ శాటిలైట్ బరువు 2450 కిలోలు ఉంటుందని తెలిపింది. భూ వాతావరణంలోకి ప్రవేశించగానే శాటిలైట్ మండిపోతుందని వెల్లడించింది. దాని శిథిలాలు భూమిపైన ఎక్కడైనా పడే అవకాశం ఉన్నట్లు నాసా పేర్కొంది. కొన్ని శిథిలాలు ఆ కక్ష్యలోనే ఉండిపోతాయని సమాచారం.
శాటిలైట్ నేల రాలనుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాసా చెప్పింది. శాటిలైట్ శిథిలాలతో ప్రమాదం జరిగే అవకాశాలు చాలా తక్కువ అని నాసా స్పష్టం చేసింది. ఆదివారం రాత్రి ఆ ఉపగ్రహం కూలిపోనున్నట్టు వివరించింది.
ఈ ప్రక్రియకు సుమారు 17 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అమెరికా రక్షణ శాఖ అంచనా వేసింది. ఆఫ్రికా, ఆసియా, మిడిల్ఈస్ట్ మార్గాల్లో ఆ శాటిలైట్ కూలిపోయే అవకాశం ఉంది. ఈఆర్బీఎస్‌ను 1984లో ప్రయోగించారు. ఛాలెంజర్ వ్యోమనౌక ద్వారా దాన్ని నింగిలోకి పంపారు.