పార్టీ పగ్గాలు రేవంత్ చేప్పటిన తరువాత టీకాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ర్యాలీలు, నిరసనలతో రేవంత్ నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా, కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తరువాత ర్యాలీ చేసి డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.