కేసీఆర్ ను టార్గెట్ చేయడంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. వీలు చిక్కినప్పుడల్లా విమర్శల దాడిని కొనసాగిస్తుంటారు. తాజాగా ట్విట్టర్ లో రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టారు రేవంత్.
కేసీఆర్ బంగారు తెలంగాణ బూటకమని, రైతు ఆత్మహత్యల తెలంగాణ వాస్తవమని చెబుతూ ప్రభుత్వానికి చురకలంటించారు. మానుకోటలో మూడు నెలల్లో 17 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సంక్షోభ తీవ్రతకు నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఢిల్లీ టూర్ పైనా సెటైరికల్ గా స్పందించారు రేవంత్. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీలో షికారు చేస్తోన్న సీఎంకు రైతుల ఆర్తనాదాలు వినబడటం లేదా? అంటూ మండిపడ్డారు.
రేవంత్ చేసిన ట్వీట్
“కేసీఆర్ బంగారు తెలంగాణ బూటకం. రైతుల ఆత్మహత్యల తెలంగాణ విషాద వాస్తవం. మానుకోటలో మూడు నెలల్లో 17 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సంక్షోభ తీవ్రతకు నిదర్శనం. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీలో షికారు చేస్తోన్న సీఎంకు రైతుల ఆర్తనాదాలు వినబడటం లేదా!?”