– కేటీఆర్ పై రేవంత్ సెటైర్లు
– వనమా అరాచకంపై మౌనమెందుకు?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనపై టీఆర్ఎస్ పెద్దలు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ అకృత్యాలను వివరించాడు రామకృష్ణ. ఆ వీడియో, సూసైడ్ నోట్ ఆధారం పోలీసులు రాఘవను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రాఘవను సస్పెండ్ కూడా చేసింది టీఆర్ఎస్.
Advertisements
రాఘవ ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నా.. టీఆర్ఎస్ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ట్విట్టర్ మంత్రి కేటీఆర్ తెలంగాణలో జరిగే ఘటనలపై స్పందించరు. దేశవ్యాప్తంగా జరిగే ఘటనలు మాత్రమే ఆయనకు కనిపిస్తాయి. తెలంగాణలో కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటే కనిపించలేదా? నిందితుడు ఎమ్మెల్యే కుమారుడు కావడంతో కాపాడుతున్నారు. అమానుషంగా ఉండేందుకు కొంత హద్దు ఉంటుంది’’ అంటూ ట్వీట్ చేశారు.