డైనమిక్ యంగ్ పొలిటీషియన్…మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డి పొలిటికల్ గేమ్స్ బాగా ఆడతారు. ఆయన గేమ్ మొదలెడితే ప్రత్యర్ధి ఎంతవాడయినా చిత్తయిపోవాల్సిందే. రియాల్ లైఫులో రియల్ గేమ్స్ కూడా రేవంత్ చెలరేగిపోతారు. అతనిలో ఒక మాంచి ఆటగాడు ఉన్నాడు. రంగారెడ్డి జిల్లా ఫుట్ బాల్ టీమును సత్కరించడానికి వెళ్ళిన ఎంపీ రేవంత్‌కి ఆడాలని కోరిక పుట్టింది. అంతే..! ప్లే గ్రౌండ్‌లో దిగిపోయాడు. దున్నిపారేశాడు. భలే గోల్స్ కొట్టి ఆటగాళ్ళతో సూపర్ సర్.. అనిపించుకున్నాడు. పాతికేళ్ళ కుర్రాడిలా ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డి గ్రౌండ్‌లో ఆడే విధానం సూపరంటూ ట్విట్టర్లో ఒక్కటే ప్రసంశల జోరు. అభిమానుల హుషారు. ఎంతైనా రేవంత్ స్టైలే వేరు..!