హుజూర్‌నగర్‌ ప్రచారానికి రేవంత్‌రెడ్డి - Tolivelugu

హుజూర్‌నగర్‌ ప్రచారానికి రేవంత్‌రెడ్డి

హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి వెళ్తారా… లేదా… అన్నది హాట్ టాపిక్ అయిపోయింది. నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. నోటిఫికేషన్ రాకముందే హుజూర్ నగర్ అభ్యర్థి తన భార్య పద్మావతి అని ఉత్తమ్ ప్రకటించడం, దానికి రేవంత్ కౌంటర్ ఇవ్వడం జరిగాయి. పార్టీలో చర్చించకుండా అభ్యర్థి ని ఎలా ప్రకటిస్తారు అని రేవంత్ మీడియా ముఖంగా ప్రశ్నించారు. ఉత్తమ్ పద్మావతి తన అభ్యర్థి అని చెప్పారు నేను కూడా చామల కిరణ్ అనే అభ్యర్ది పేరును సూచిస్తున్న అని అనడంతో ఒక్కసారిగా గాంధీభవన్ రాజకీయాలు వేడేక్కాయి.

అప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న సీనియర్స్ ఒక్కటై రేవంత్ పై ఎదురుదాడి మొదలు పెట్టారు. ఉత్తమ్ ఒకడుగు ముందుకు వేసి రేవంత్ దిష్టిబొమ్మలను తగలబెట్టించారు. దాంతో రేవంత్ కు సీనియర్స్ కు దూరం బాగా పెరిగింది. పార్టీ పద్మావతి పేరుని అధికారికంగా ప్రకటించడం తో రేవంత్ సైలెంట్ అయ్యారు. దీంతో… రేవంత్ రెడ్డి అసలు ప్రచారానికి వెళ్తారా లేదా అన్న అనుమానం అటు క్యాడర్ లో నెలకొంది. ఇప్పటికే రేవంత్ ఆక్టివ్ గా ఉండి ఉంటే టీడీపీ అభ్యర్థి ని పెట్టేవారు కాదు అన్న చర్చ బలంగా ఉంది. హుజూర్ నగర్ లో రేవంత్ కు మంచి ఫాలోవింగ్ ఉంది, అక్కడి క్యాడర్ కూడా రేవంత్ రెడ్డిని ప్రచారానికి తీసుకరావాలి అని ఉత్తమ్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. రేవంత్ అనుచరులు మాత్రం హుజూర్ నగర్ ఎందుకు వెళ్ళాలి, నల్గొండ నేతలు చాలా విమర్శలు చేశారు, పక్క జిల్లా నేతకు నల్గొండ తో ఎమ్ సంబంధం అని విమర్శించారు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ వెళ్లాల్సిన అవసరం లేదు అంటున్నారు. కానీ రేవంత్ మాత్రం హుజూర్ నగర్ ప్రచారం లో పాల్గొంటా అని చెప్తున్నారు. తాను పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు ప్రయత్నిస్తా అంటున్నారు. చివరి రెండు రోజులు హుజూర్ నగర్ ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పద్మావతి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి మరీ మద్దతు కొరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ పోటీలో ఉండడం అటు సీపీఐ టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం తో కాంగ్రెస్ గెలుపు కష్టసాధ్యంగా కనిపిస్తుంది, ఈ సమయం లో రేవంత్ కు ఉన్న మాస్ ఇమేజ్ తమకు ఉపయోగ పడుతుందని ఉత్తమ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే టీడీపీ ఓటు కూడా కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాలు లేకపోలేదు. సెటిల్లర్స్ ప్రాభవం ఉన్న నియోజకవర్గం కాబట్టి రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అనేది రాజకీయవిశ్లేషకుల అభిప్రాయం

Share on facebook
Share on twitter
Share on whatsapp