ప్రభుత్వం తెచ్చిన 317 జీవోను ఉద్యోగ, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు తీవ్ర ఆవేదనతో చనిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బీంగల్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి 317 జీవోను వ్యతిరేకిస్తూ సూసైడ్ చేసుకున్నారు.
కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో, 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోంది.దానికి తాజా ఉదంతం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య.
ఉద్యోగుల కేటాయింపు,బదిలీల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో ఉంది.
317 జీవో రద్దు కోసం ప్రభుత్వం పై పోరాడుదాం. pic.twitter.com/EizGebVKcU— Revanth Reddy (@revanth_anumula) January 9, 2022
Advertisements
సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కారును పోలీసులు ఛేజ్ చేసి కమ్మర్ పల్లి దగ్గర అడ్డుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేశారు.
జీవన్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యలపై స్పందించే ప్రతిపక్ష నేతలు కేసీఆర్ కు దొంగల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. పోలీసులు విపక్ష నేతలను వెంటాడి అరెస్ట్ చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారని నిలదీశారు.
బాధిత కుటుంబాలను పరామర్శించడం ఏమైనా నేరమా? ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడం ప్రజలు, రాజ్యాంగం ప్రతిపక్ష నేతలకు ఇచ్చిన హక్కని గుర్తు చేశారు రేవంత్. కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోందన్న ఆయన.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.