కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అంటూ ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టడంపై ప్రగతి భవన్ ను ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలు ముట్టడించారు. ఈ అంశం ఓవైపు కోర్టులో ఉండగానే ప్రభుత్వం పరీక్షల తేదీలు ఖరారు చేయటంపై ఎన్.ఎస్.యూ.ఐ మండిపడింది.

ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయటంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పోరాటం తెగిస్తే ఖాకీల కాపలాలు, ఇనుప కంచలు ఆపలేవు. కరోనా సమయంలో ప్రవేశ పరీక్షల నిర్వహణ దుర్మార్గం. నిరసనగా కేసీఆర్ గడీని ముట్టడించిన NSUI కి అభినందనలు అంటూ ట్వీట్ చేస్తూ తొలివెలుగు వీడియోను రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.