కేసీఆర్ గెలుపు, హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. అభివృద్ది మంత్రంతో గెలిచిన టీఆర్ఎస్… కొడంగల్ అభివృద్ధి సంగతి చెప్పాలని డిమాండ్ చేశారు.
హరీష్‌రావు ఆర్టీసీలో, సింగరేణిలో కవిత యూనియన్లు గెలిచినప్పుడు యూనియన్లు గుర్తుకు లేవా అని ప్రశ్నించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. రామారావు ఎంత చేసిన ఓడించారని గుర్తు చేసిన రేవంత్, హుజూర్‌నగర్… కొడంగల్‌లో అభివృద్ది పేరుతోనే గెలిచారన్నారు. కొడంగల్‌లో ఎంత అభివృద్ది చేశారో చెప్పాలని ప్రశ్నించారు. శ్రీశైలం 1000 కోట్లు, నాగార్జున సాగర్ 130కోట్లతో పూర్తయితే… లక్షల కోట్లు పెట్టినా కాళేశ్వరం పూర్తి కాలేదన్నారు రేవంత్.
కొమురం భీం, చాకలి ఐలమ్మ,రాం కి గోండు, సర్వాయి పాపన్న వంటి వారు కూడా పోరాడింది స్వేచ్ఛ కోసమే. అసలు తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ.. కానీ తిరుగుబాటు కాదు.సంక్షేమం కోసం స్వేచ్ఛను వదులుకోరు అని స్పష్టం చేశారు.