టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా పలువుర్ని కలుస్తున్నారు రేవంత్. అలా.. మంగళవారం బిగ్ బాస్ ఫేం గంగవ్వను కలిశారు. ఎంతో ఆప్యాయంగా ఆమె చెప్పిన మాటలకు రేవంత్ ఎమోషనల్ అయ్యారు.
రేవంత్ రెడ్డి కోసం గంగవ్వ ప్రేమతో మిర్చి బజ్జీ తీసుకొచ్చింది. వాటిని ఆయన ఎంతో ఇష్టంగా ఆరగించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ కన్నతల్లి గుర్తొచ్చిందని ట్వీట్ చేశారు.
రేవంత్ చేసిన ట్వీట్
గంగవ్వ! తెలంగాణకు పరిచయం అక్కరలేని అవ్వ… ప్రపంచానికి తనొక సెలబ్రిటీ. నాకు మాత్రం ప్రేమను పంచిన అమ్మ. నా కోసం ఆప్యాయంగా… నాకిష్టమైన మిర్చీ బజ్జీ తెచ్చి… తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది. “యాత్ర”లో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా… నా అనుభవాలను నా తల్లితో ఇలాగే ముచ్చటించే వాడిని. తల్లిని గుర్తు చేసిన గంగవ్వను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను.