హైదరాబాద్ : అబద్ధాలు చెప్పిన జెన్‌కో ప్రభాకర్‌రావుని అమరుల స్తూపం దగ్గర కాల్చినా తప్పు లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రూ.3.90లకే విద్యుత్ వస్తుందని ప్రభాకర్‌రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని దుయ్యబట్టారు. కేసీఆర్ దోపిడీకి ప్రభాకర్‌రావు సహకరిస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ ఇంకా ఏమన్నారంటే…..
- తప్పుడు ఒప్పందాల మీద ప్రభాకర్‌రావు సంతకాలు చేస్తున్నారు.
- పదవి కాలం ముగిసిన వారిని కీలకమైన స్థానంలో నియమించి కేసీఆర్ దోపిడీ చేస్తున్నారు
- గతంలో ప్రభుత్వం జెన్కో, డిస్కం, పంపిణీ సంస్థలకు సీనియర్ ఐఏఎస్‌లను సీఎండీలుగా నియమించేది.
- కానీ తెలంగాణ ప్రభుత్వం అర్హత లేని ప్రభాకర్‌రావుని నియమించి దోపిడీకి పాల్పడుతోంది.
- విద్యుత్ సెంటిమెంట్‌ను కేసీఆర్ నోట్ల మూటలను కట్టలు కట్టుకోవడానికి వినియోగించుకుంటున్నారు.
- చత్తీస్‌గఢ్ నుంచి దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల వేల కోట్ల అదనపు భారం పడింది.
- ఈ ఒప్పందంలో లొసుగులున్నాయని అప్పటి సెక్రటరీ అరవింద్ కుమార్ లేఖ రాశారు.
- దాంతో ఆయన్ను బదిలీ చేశారు.
- చత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల కొనుగోలు వెనుక అదాని కంపెనీ ఉంది.
- కొనుగోలు ఒప్పందం చేసుకున్న మార్వా విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అదాని కంపెనీ బొగ్గు సరఫరా చేస్తుంది.
- అదాని కంపెనీకి మేలు చేయడానికి తెలంగాణ ప్రజల మీద 1200 కోట్ల భారాన్ని మోపారు.
- ఓపెన్ బిడ్డింగ్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ ధరకు విద్యుత్ దొరికేది..
- విద్యుత్‌లో నాలుగు రకాల ఒప్పందాలు ఉంటాయి.
- అత్యవసర విద్యుత్ కొనుగోళ్ల పేరిట కూడా దోపిడీ చేస్తున్నారు.
- 28వ తేదీన ఆరు రూపాయల ఎనిమిది పైసలకు యూనిట్ కొనుగోలు చేశారు.
- అమ్మేవాళ్లు, కొనేవాళ్లు సిండికేట్‌గా మారి అత్యవసర కొనుగోళ్ల పేరుతో దోపిడీ చేస్తున్నారు.
- 2016-17లో ఒప్పందం చేసుకుని విద్యుత్ వినియోగించుకోకపోవడం వల్ల 957 కోట్ల నష్టం జరిగింది.
- అదనపు ఒప్పందం చేసుకుని విద్యుత్ సంస్థలకు వేల కోట్లు చెల్లిస్తున్నారు.ఇదో రకమైన దోపిడీ.
- తక్కువ ధరకు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి సరఫరా చేస్తామని ఎన్టీపీసీ చెబుతుంటే దానికి స్థలం కేటాయించడం లేదు.
- ఏపీ జెన్కో సరఫరా చేస్తామంటే ఒప్పుకోకుండా 4.90 రూపాయలు పెట్టి కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ సంస్థల వద్దకు వెళ్లారు.
- ఏపీ జెన్కో 4.62కె సరఫరా చేస్తామని లేఖ రాసింది.
- కేసీఆర్ అవినీతి మీద మేము ఫిర్యాదు చేస్తాం.
- విచారణ జరిపించడానికి లక్ష్మణ్, నడ్డా, కిషన్‌రెడ్డి సిద్ధమా అని సవాల్ విసురుతున్నా..
- నా ఆరోపణలు తప్పయితే ఏ శిక్షకైనా నేను సిద్ధం.
- టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆపాలి.
- సీబీఐ విచారణకు బీజేపీని అడ్డుకుంటుంది ఎవరు..?
- తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన గోల్‌మాల్‌పై విచారణ జరిపించాలి.