రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ
బీజేపీ ప్రభుత్వం.. 80 కోట్ల జీవనాధారాన్ని.. కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతోంది. మూడు నల్ల చట్టాలతో రైతు జీవితాలపై మరణ శాసనం రాస్తోంది. ఆదానీ , అంబానీ లకు దేశాన్ని తాకట్టు పెడుతోంది. 20 మంది రైతులు ఢిల్లీలో మరణించినా.. ప్రధాని మోదీ ప్రభుత్వం చలించడం లేదు. రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ముట్టడి కి పిలుపు ఇచ్చింది. మోదీ తో చేసుకున్న చీకటి ఒప్పందం మేరకు సీఎం కేసీఆర్ మమ్మల్ని నిర్భందిస్తున్నారు. నాణేనికి బొమ్మ , బొలుసు .. మోదీ, కేసీఆర్. భారత్ బంద్ కు మద్దతు పలికిన కేసీఆర్ నాలుగు రోజుల్లోనే యూ టర్న్ తీసుకున్నారు.
రైతు చట్టాల వల్ల భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయి. రైతులకు కాంగ్రెస్ కల్పించిన భరోసా ను .. ఈ నల్ల చట్టాల ద్వారా ఎత్తేశారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామంటోంది. కేసీఆర్, నరేంద్ర మోడీ రైతులకు చేస్తున్న అన్యాయం మీద కాంగ్రెస్ పోరాడుతుంది. నల్ల చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుంది.
కాంగ్రెస్ జెండా.. రైతులకు అండగా ఉంటుంది. కేసీఆర్ ను కాపాడుతున్నది బీజేపీనే.. ఏడేళ్ల లో ఒక్క విచారణ చేపట్టడం లేదు.సాగు నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టు లలో వేల కోట్ల దోపిడీ కి పాల్పడ్డారు. గల్లీలో కుస్తీ చేస్తూ.. ఢిల్లీలో దోస్తీ చేస్తున్న తీరును ప్రజలు గమనించాలి.