హైదరాబాద్ సైదాబాద్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘోరానికి కారణమని విపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.
డ్రగ్స్, గంజాయి, మద్యం మత్తులో విశ్వనగరం జోగుతోంటే.. పాలన ఫాంహౌస్ లో సేదతీరుతోందని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఫలితంగా… సైదాబాద్‌లో ఆరేళ్ల గిరిజన పసి ప్రాణం బలైపోయిందని ఆరోపించారు. కేసీఆర్ ఇది చూసి ఏం అనిపించడం లేదా? న్యాయం కోసం బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నేటి నీ దిష్టిబొమ్మ దగ్ధం… రేపటి నీ పాలన చరమగీతానికి సంకేతం అంటూ మండిపడ్డారు.
డ్రగ్స్, గంజాయి, మద్యం మత్తులో విశ్వనగరం జోగుతోంది. పాలన ఫాంహౌస్ లో సేదతీరుతోంది. ఫలితం… సైదాబాద్ లో ఆరేళ్ల గిరిజన పసి ప్రాణం బలైపోయింది. కేసీఆర్ నీకేమీ అనిపించడం లేదా? న్యాయం కోసం బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా? నేటి నీ దిష్టిబొమ్మ దగ్ధం… రేపటి నీ పాలన చరమగీతానికి సంకేతం. pic.twitter.com/lt1ARjz3ec
— Revanth Reddy (@revanth_anumula) September 12, 2021
Advertisements