తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కందులు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదని మండిపడ్డారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత.. రూ. 5 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారని.. గిట్టుబాటు ధర ఇస్తే అసలు రైతుకు చావాల్సిన అవసరం ఏముందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతలనే కాదూ.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా? యువతకు ఉద్యోగాలు ఇచ్చారా అని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం ఏమైందని అన్నారు. అటు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావుకు ఎందుకు ఓటు వేయాలన్న రేవంత్ రెడ్డి… ఏ మొహం పెట్టుకొని ఆయన మళ్లీ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డికి ఓటు వేస్తే.. మండలిలో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పారు రేవంత్ రెడ్డి.