ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చిలుక నగర్ డివిజన్ అభ్యర్థి బీనా భాస్కర్ రెడ్డి ని గెలిపించాలని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. 50 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకు సర్పంచ్ గా, మున్సిపల్ ఛైర్మన్ గా రామంతపూర్, ఉప్పల్, చిలుక నగర్ లో ఏ పేదోడిని అడిగినా శివారెడ్డి చేసిన సేవలు చెప్తారని,కాంగ్రెస్ పార్టీ శివారెడ్డి కుటుంబానికి అందుకే అవకాశం ఇచ్చిందన్నారు.
ఏడేండ్ల నుంచి ఇదే కేటిఆర్ మంత్రి, కేసిఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు. కిషన్ రెడ్డి మంత్రి అయిండు. ఈ చిలుక నగర్ లో జనాల కష్టాల మీద ఒక్కరైనా వచ్చిర్రా? టిఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటిముందు కంకర పడ్డా వచ్చి కప్పం కట్టమంటున్నడు. పేదవాళ్లకు మేలు జరగాలంటే కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు. కేసిఆర్ మిడతల దండును పంపిండని,
కేసిఆర్ కు, ఆయన కొడుకు కు దేవుడు కొంచెమైనా సిగ్గు పెట్టిండా అని నేను అడుగుతున్న నన్నారు.
పేదోళ్లు వరదల్లో నానా అవస్థలు పడుతుంటే రాని ఈ మిడతల దండు ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారని విమర్శించారు. ఇక్కడ పసిబిడ్డ నాలాలో పడి 2కిలోమీటర్ల అవతల చెరువులో శవమై తేలింది. కనీసం ఒక్క మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ గాడిద గాడైనా వచ్చిండా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరోజైనా ఇక్కడికి వచ్చిండా? అని ప్రశ్నించారు.
టిఆర్ఎస్, బిజెపిలు కలిసి హైదరాబాద్ లో మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న రేవంత్… జిహెచ్ఎంసిలో 50 మంది ఎంఐఎం వాళ్లు, కౌరవుల వలే 100 మంది టిఆర్ఎస్ కార్పొరేటర్లు, 45 మంది ఎక్స్ అఫిసియో సభ్యులు, 50 మంది అధికారులు అందరూ ఒక్కవైపు కుసున్నరు. నేను ఒక్కడినే ఉన్న. వాళ్లతో కొట్లాడినప్పుడు నాకు అనిపించింది.
నాకు పాతిక, 30 మంది కార్పొరేటర్లు నాకు తోడుగా ఉంటే వీళ్ల తోలు వొలిచి పేదోళ్లకు చెప్పులు కుట్టించొచ్చు అనిపించింది. అందుకే కాంగ్రెస్ నేతలను గెలిపించాలని కోరారు.