పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణం పాలుకావడం దిగ్భ్రాంతిని కలిగించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనుల్లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు.
పంప్ హౌస్లోకి దిగుతుండగా వైరు తెగిపడి వారు మృతి చెందగా, ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇకపోతే ఈ ప్రమాదంలో మరణించివారు బిహార్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటన పాలమూరు- రంగారెడ్డి ప్యాకేజీ -1లో జరిగినట్లుగా సమాచారం.
అసలేం జరిగిందంటే…
కృష్ణానదిపై ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ వ్యయంతో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. పంప్ హౌస్‌లోకి క్రేన్ ను దించుతుండగా ఒక్కసారిగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందారు.క్రేన్ వైరు తెగిపడటం వల్లే ప్రమాదం జరిగిందని తోటి కూలీలు చెబుతున్నారు.కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద జరుగుతున్నవి.
నిర్మాణ పనుల్లో భాగంగా పంప్‌హౌస్‌లోకి క్రేన్ దింపుతుండగా.. ఒక్కసారిగా తీగలు తెగిపడి ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇంకా ఎవరైనా గాయపడ్డారనే సమాచారం తెలియాల్సి ఉంది.ప్రమాదంలో మరణించిన వారంతా బిహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు.మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఇప్పటి వరకు లిఫ్ట్ పనుల్లో ప్రమాదం జరిగిందని గానీ, కూలీలు మృతి చెందారన్న విషయం గురించి కానీ అటు అధికారులు, ఇటు పోలీసులు ఎటువంటి సమాచారాన్ని బయటకు రానివ్వలేదు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణంపాలుకావడం దిగ్భ్రాంతిని కలిగించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మృతులకుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
— Revanth Reddy (@revanth_anumula) July 29, 2022
Advertisements