శ్రీశైలం పవర్ హౌజ్ లో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోడీకి ఎంపీ రేవంత్ రెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో కుట్ర కోణం ఉందని ఆరోపించిన రేవంత్ రెడ్డి, సీబీఐతో పాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ( CEA )తో శాఖాపరమైన విచారణకు ఆదేశించాలని లేఖలో కోరారు.
ఈ ప్రమాదం వల్ల వందల కోట్ల జాతి సంపదకు నష్టం వాటిల్లటమే కాదు, ఈ ప్రమాదం వల్ల కొందరికి లాభం జరుగుతుందని రేవంత్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రమాదం వల్ల ప్రైవేటు వ్యక్తులకు లాభం చేసే కుట్ర ఉందన్న అనుమానం ఉందని, బయట నుండి ఎవరెవరి దగ్గర విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు, ఎంతకు కొనుగోలు ప్రజలకు తెలవాలన్నారు. ఎలాంటి అర్హత లేని ప్రభాకర్ రావును రాజకీయ కారణాలతో సీఎండీగా నియమించటంపై కూడా పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీఐడీ విచారణలో తమకంటై పై స్థాయి అధికారులను దోషిగా తేల్చి, శిక్షపడేలా చేయలేరని, శాఖా పరమైన విచారణ కూడా పేరుకేనని రేవంత్ ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు.