కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యూహాం ఫలిస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు షాకిచ్చేందుకు రేవంత్ సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నట్లు కనపడుతోంది. రేవంత్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి పరిధిలో ఉన్న అనేక కార్పోరేషన్లలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.
టీఆర్ఎస్‌లో కీలక నేతలుగా ఉండి, ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న నేతలే టార్గెట్‌గా రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్‌లో మేయర్ స్థానాన్ని ఆశించి భంగపడ్డ నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకవస్తున్నారు. తాజాగా పీర్జాధిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పదవిని దర్గ దయాకర్ రెడ్డి ఆశించారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు మేయర్ పదవి ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో రేవంత్‌రెడ్డి తెలివిగా పావులు కదిపి…స్వయంగా తానే దయాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని కోరారు. ఆయన కూడా అంగీకరించటంతో రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు.
రేవంత్‌తో వచ్చిన నేతను కిడ్నాప్ చేసిన మంత్రి మల్లారెడ్డి?
దయాకర్ రెడ్డి పీర్జాధిగూడ ప్రాంతంలో మంచి పట్టున్నట్లు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజవకర్గం నుండి పోటీ చేసిన సమయంలో అక్కడ ఆయన క్రీయాశీలకంగా వ్యవహరించారు. పైగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితోనూ మల్లారెడ్డికి విభేదాలున్నాయి. తన వర్గం నేతలకు టికెట్స్ ఇవ్వటం లేదని సుధీర్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో… టీఆర్ఎస్ నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరును తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
Advertisements