కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులుగా భిన్నాభిప్రాయాలు ఉన్నా, కేంద్ర పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. హుజుర్ నగర్‌లో గెలుపు తమ అభ్యర్థి చేతి గుర్తుదేనని, కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీచేసినా గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీలో సీఎల్పీ నాయకుడు భట్టిపై సీఎం మాట్లాడిన తీరు అభ్యంతరకరమని, సీఎం వెంటనే భట్టికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హుజుర్ నగర్‌లో కాంగ్రెస్‌ను గెలిపించి, కేసీఆర్‌కు కనువిప్పు కలిగించాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ నేత, నిరుద్యోగ యువత కనీసం ఒక్కరోజైనా హుజుర్ నగర్‌లో పర్యటించి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.