సికింద్రాబాద్ బోయగూడ అగ్నిప్రమాదంలో 11 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవాలన్నారు రేవంత్. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.
స్క్రాప్ గోడౌన్ లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 11 మంది సజీవదహనం అయ్యారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇటు మృత దేహాల గుర్తింపు పూర్తయింది. గురువారం ఉదయం వాటిని తరలించనున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుండి పాట్నాకు తీసుకెళ్లి.. అక్కడి నుండి స్వస్థలాలకు తరలించనున్నట్లు సమాచారం.