జగ్గారెడ్డి ఇష్యూ పార్టీ దృష్టికి వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తమ పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడుతున్నారని చెప్పారు. జగ్గారెడ్డికి అండగా ఉంటామని.. అధిష్టానం అపాయింట్ మెంట్ కోరారని తెలిపారు. అసత్య ప్రచారాలపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
గతంలో వీహెచ్ పై కూడా ఇలాగే సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగిందని గుర్తు చేశారు రేవంత్. ఆరా తీస్తే కౌశిక్ రెడ్డి అనుచరుడని తేలిందన్నారు. జగ్గారెడ్డి ఇష్యూ.. తమ కుటుంబ సమస్య అని తెలిపారు. అందరం కూర్చొని మాట్లాడుకుంటామని.. పీసీసీ చీఫ్ గా కొన్ని విషయాలు బయట మాట్లాటలేనని చెప్పారు.
జగ్గారెడ్డి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడన్న రేవంత్.. రాజకీయాలకు రాకముందు నుంచి పరిచయం ఉందన్నారు. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ లు వచ్చాయని కృంగిపోవద్దని ధైర్యం చెప్పారు.
మనం మానసికంగా కృంగిపోతే శత్రువులు మరింత విజృంభిస్తారని అన్నారు రేవంత్. ఇలాంటి విషయాల్లో మనోధైర్యంతో బలంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. తనకు కూడా ఇలాంటివి ఎదురయ్యాయని.. జగ్గారెడ్డి విషయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటదని స్పష్టం చేశారు.