తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సచివాలయం కూల్చివేతలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రేవంత్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రేవంత్ సవాలు చేశారు.
సచివాలయం కూల్చివేతతో ప్రజధనాన్ని వృథా చేస్తున్నారంటూ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు గతంలో కొట్టివేసింది. కొత్త సచివాలయ నిర్మాణం అంత హిజీ కాదని, 2006 పర్యావరణ చట్టాలు, హుస్సేన్ సాగర్ పరివాహాక ప్రాంతంలో నిర్మాణాలపై గతంలో ఉన్న ఉత్తర్వులను అమలయ్యేలా చూడాలని రేవంత్ రెడ్డి కోరే అవకాశం కనపడుతుంది.
ఇదే అంశంపై ఇప్పటికే ఎన్జీటీలో రేవంత్ కేసు వేయగా, ఇటీవలే ఎన్జీటీ నియమించిన విచారణ కమిటీ సచివాలయం కూల్చివేతల స్థలాన్ని పరిశీలించింది. రేవంత్ తన వాదనలకు మరింత బలాన్నిచ్చే మ్యాపులు, వివరాలను కూడా అందించాడు.