- సచివాలయానికే రాని ముఖ్యమంత్రికి ఇబ్బంది అవుతోందని, హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి దూరం ఉందని… ఒ బ్లాక్ నుండి మరో బ్లాక్‌కు వర్షకాలంలో ఫైల్స్ తీసుకెళ్తుంటే తడిసిపోతున్నాయంటూ ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. ప్రస్తుత సచివాలయ కూల్చివేతకు, నూతన సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం చూపిస్తోన్న కారణాలపై మేధావులు, ప్రతిపక్ష నేతలు నవ్వుతోన్నారు. ప్రభుత్వం చూపిన కారణాలు ఒసారి చూస్తే…
- రోజు వందల మంది విజిటర్స్ వస్తున్నారు పార్కింగ్ ఇబ్బంది గా ఉంది.
- సచివాలయంలో సీఎం ఛాంబర్ కు హెలిప్యాడ్ 300 మీటర్ల దూరం లో ఉంది. అది ఇబ్బంది గా ఉంది.
- విద్యుత్ శాఖ 500 గజాల స్థలం అడుగుతోంది , ఇక్కడ బిల్డింగ్ కూల్చి స్థలం వాళ్లకు కేటాయిస్తం.
- పాత రికార్డ్స్ పెట్టడానికి స్థలం లేదు.
- ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పిన మార్పులు చేయాలంటే ఇబ్బంది… ప్రతి రోజు వీఐపీలు వస్తుంటారు.
- అయితే, దీనిపై పిటిషనర్ రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే సచివాలయాన్ని వేరే బిల్డింగ్స్‌కు మార్చారు. ప్రస్తుతం సచివాలయం ఖాళీగానే ఉంది. ఫైర్ సెఫ్టీ మరమ్మత్తులు ఇప్పుడు చేసుకోవచ్చు అని వాదించారు. మేము కొత్త సచివాలయం కట్టుకోవడానికి వ్యతిరేకం కాదు, సచివాలయం ఇక్కడి నుంచి మార్చుకోవడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ కొత్త భవనాలను కూల్చడానికి మాత్రం వ్యతిరేకం.ప్రజాధనాన్ని వృధా చేసే హక్కు ఎవ్వరికీ లేదు, ఇంకొన్ని సంవత్సరాల తరువాత కొత్త ప్రభుత్వం వస్తది వాళ్ళు కొత్తది కట్టుకుంటాం అంటే ప్రజాధనం వృధా అవుతోంది. ప్రభుత్వం అంటే అతీత శక్తి కాదు, సహేతుక నిర్ణయాలు తీసుకోకపోతే అడ్డుకునే హక్కు కోర్టుకు ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా బిల్డింగ్స్ పనికిరావు కూల్చమని రిపోర్ట్ ఇవ్వలేదు, కేవలం కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది అని రిపోర్ట్ ఇచ్చారు అని వాదించారు రేవంత్ రెడ్డి తరుపు లాయర్ రజనీకాంత్ రెడ్డి.