హైదరాబాద్ : ‘విశ్వేశ్వరరెడ్డి గుడి కడితే… నా జీతం డబ్బులతో కేసీఆర్‌కు సమాధి కడతా’ అంటూ ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పాలమూరు ప్రజలకు నీళ్లు ఇస్తే మంచిది… లేకుంటే దంచి తీసుకుంటాం’ అని వార్నింగించ్చారు. రేవంత్ సంచలన వ్యాఖ్యలు ఇవిగో..
- అమాయక పాలమూరు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు
- నేను ఎక్కడ నుంచి గెలిచినా పాలమూరు బిడ్డను.
- పాలమూరుకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను.
- కేసీఆర్‌కి సవాల్ చేస్తున్నా.
- మేము కట్టిన ప్రాజెక్టుల లెక్క… సాగు చేసింది ఎంతో… మీ హయాంలో జరిగింది ఎంతో చర్చకు రా..
- కేసీఆర్ మద్యం అమ్ముడులో తెలంగాణని నెంబర్‌వన్ చేసిండు
- కృష్ణా జలాల్లో 299 టీఎంసీ నీళ్లే వస్తాయి అని ఎప్పుడో చెప్పాం.
- ఇప్పుడు కేసీఆర్ గోదావరి నుంచి శ్రీశైలంకి నీళ్లు తెస్తా అంటున్నాడు.
- కేసీఆర్ ఎత్తిపోతల.. తిప్పిపోతలు ఎందుకు చేస్తున్నాడో ప్రజలు అర్థం చేసుకోవాలి.
- కమీషన్ల కోసం కక్కుర్తి పడి… రాయలసీమను రతనాల సీమ చేస్తా అంటున్నాడు.palamuru