రూపాయకే నల్లా కనెక్షన్ అని, ప్రతి గల్లీలో అద్దంలాగ రోడ్డేస్తమని…చిలుక పలుకులు పలికే కేటిఆర్ ఉప్పల్ ను దత్తత తీసుకుంటా అన్నడని…దత్తత తీసుకుంటా అన్న దరిద్రుడు కేటిఆర్ రూపాయి పనైనా చేసిండా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఉప్పల్ నడిబొడ్డున చెత్త ట్రాన్సిట్ పాయింట్ వల్ల వాసనతో జనాలు రోగాలతో చస్తుంటే ట్రాన్సిట్ ప్లాంట్ ను శివారులోకి తరలించలేకపోయారని,పార్కులు కబ్జా పెట్టుకున్నరన్నారు. వరదలు వచ్చి బురదలో కొట్టుకుపోయినప్పుడు రాలేదు కానీ కరోనా వచ్చినప్పుడు వీళ్లెవరూ రాలేదన్నారు. కానీ నేడు ఓట్ల కోసం మిడతల దండులా వచ్చి పడ్డరని రేవంత్ విమర్శించారు.
హైదరాబాద్ వచ్చి భారత్ బయోటెక్ పోయిన ప్రధాని మోడీ….ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులకు అవకాశం ఇచ్చినా ఇయ్యకపోయినా స్థానిక ఎంపీకి ప్రధానికి స్వాగతం పలికే అవకాశం ఇవ్వాలి కానీ
మోడీ అధికారిక కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత లేదా? ఒక ఎంపీని అవమానించడం న్యాయమా?
మీరా ఈ ప్రాంత ప్రజలను కలిపి ఉంచేలా అభివృధ్ది చేస్తరా? అని రేవంత్ మండిపడ్డారు.
67వేల కోట్లు ఎవని ముక్కులో పెట్టినవు రా అని కేటిఆర్ ను అడగాలనుకుంటున్న సందర్భంలో బిజెపి వాళ్లు మత పంచాయతీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిని చేస్తే చిల్లి గవ్వ తేలేనప్పుడు కార్పొరేటర్ నిధులు తెస్తడా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఉప్పల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బీజేపీ 20 బిల్లులు పార్లమెంటులో పెడితే అన్నింటికి కేసీఆర్ మద్దతు ఇచ్చారని, మనం ఇక్కడ కారు బొమ్మకు ఓటు వేస్తే ఢిల్లీకి పోయి కమలం పువ్వుకు మారుతుందన్నారు. హైదరాబాద్ ను కాంగ్రెస్ అభివృద్ధి చేస్తే ధనిక రాష్ట్రమైన తెలంగాణను టీఆరెస్ అప్పులపాలు చేసిందన్నారు.
కేటిఆర్ మొనగాడన్నట్లు పరమేశ్ ను పిలగాడు అన్నడట. పిలగాడో చిచ్చర పిడుగో ఎన్నికల్లో నీకు తెలుస్తదని రేవంత్ హెచ్చరించారు. ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ పోవాలంటే టిఆర్ఎస్ కు విఆర్ఎస్ ఇవ్వాల్సిందేనని రేవంత్ పునరుద్ఘాటించారు.