గాంధీ భవన్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు :
- బీజేపీ, టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఒకరి ఉనికి ఒకరు కాపాడే విధంగా సహకరించుకుంటున్నారు.
- విద్యుత్ కొనుగోళ్లలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ లక్ష్మణ్ ఆరోపించారు.
- సిబిఐ విచారణకు అదేశించండి.. నిజాయితీ నిరూపించుకుంటాం.. అని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు.
- 2016 ఫిబ్రవరి 1న అప్పటి ప్రిన్సిపాల్ సెక్రటరీ ఇండియా బుల్స్ వదిలేసిన సబ్ క్రిటికల్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేయడానికి అవకాశం ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారు.
- దాని ద్వారా 2017 నాటికి భద్రాద్రి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు విద్యుత్ ఇస్తామన్నారు.
- 2012లోనే కేంద్రం సబ్ క్రిటికల్ టెక్నాలజీని నిషేధించింది.
- అన్ని రాష్ట్రాలు సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ కావాలని కేంద్రం ఆదేశించింది.
- గుజరాత్ రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్ట్ కోసం బీహెచ్ఈఎల్‌కు ఇండియా బుల్స్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ మిషనరీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది..
- కానీ తర్వాత కేంద్ర నిర్ణయంతో దాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరించింది.
- ఆ కంపెనీ తిరస్కరించిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది.
- ఇండియా బుల్స్‌ను గట్టెక్కించడానికే కేంద్రం నిషేధించిన టెక్నాలజీని కొన్నారు.
- యాదాద్రి ప్రాజెక్టులో 32 వేల కోట్ల పనులను నామినేషన్ పద్దతిలో కాంట్రాక్ట్ ఇచ్చారు.
- బీహెచ్ ఈఎల్‌కు కాంట్రాక్ట్ ఇచ్చి దాన్నుంచి కేసీఆర్ తన బంధువులకు పనులు ఇప్పించుకున్నారు. వారు కేసీఆర్‌కు కమిషన్లు ఇచ్చారు. వాటికి ప్రభాకర్ రావు సంతకాలు చేశారు.
- సీనియర్ ఐఎఎస్‌లను నియమించాల్సిన పోస్టుల్లో ప్రభాకరరావును ఎందుకు నియమించారు.
- ఇదే బీహెచ్ఈఎల్ జార్ఖండ్‌లో 17 శాతం లెస్‌తో ఓపెన్ బిడ్డింగ్‌లో కాంట్రాక్ట్ దక్కించుకుంది.
- కానీ ఇక్కడ నామినేషన్ పద్దతిలో పనులు ఇవ్వడం వల్ల సుమారు 6వేల కోట్ల నష్టం జరిగింది..
- జరిగిన అవినీతి మీద కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తాం.
దర్యాప్తు జరిపించేందుకు సిద్ధమా? - వారు సవాల్ విసురుతుంటే లక్ష్మణ్ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు.
- టీఆర్ఎస్‌తో బీజేపీ లాలూచీ ఏంటి..
- గల్లీలో ఫైట్ ఢిల్లీలో దోస్తీ నాటకాలు ఆపండి.
- ప్రాజెక్టుల్లో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించండి.
- కేసీఆర్‌ను లొంగదీసుకోవడానికి బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోంది.
- నిజంగా శిక్షించాలి అనుకుంటే సీబీఐ విచారణ జరిపించండి.
- మా ఆరోపణలు తప్పైతే మమ్మల్ని శిక్షించండి.
- విద్యుత్ కొనుగోళ్లలో గోల్‌మాల్‌ను రేపు ఆధారాలతో బయటపెడతా.
- కేసీఆర్ చేసిన సహారా ఇండియా కుంభకోణం, ఈఎస్ఐ హాస్పిటల్ కుంభకోణంపై మర్రి
శశిధర్ రెడ్డి బృందాన్ని పార్టీ నియమించింది. - సాగునీటిలో జరుగుతున్న అవినీతి పై ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క బృందాన్నిపార్టీ నియమించింది.
- విద్యుత్‌లో జరిగిన అవినీతి, భూ కుంభకోణంపై నాతో కమిటీ వేశారు. వీటన్నింటిపై రాజకీయ, న్యాయ పోరాటం చేస్తాం..