నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్ష రాజకీయ సంచలనానికి వేదికైంది. దీక్షకు హాజరైన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.రాజీవ్ రైతు భరోసా దీక్షను అప్పటికప్పుడు పాదయాత్రగా మార్చుకున్నారు రేవంత్ రెడ్డి.
దీక్షకు హాజరైన ఆ పార్టీ నేతలు మల్లు రవి, సీతక్క.. అదే వేదికగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని కోరారు. దీంతో అప్పటికప్పుడు హైదరాబాద్ కు పాదయాత్రగా బయలుదేరారు రేవంత్ రెడ్డి. మల్లు రవి, సీతక్క ప్రతిపాదనను ఆమోదిస్తూ.. సభకు హాజరైన కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.