టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల మేడ్చల్ జిల్లా లక్ష్మాపుర్ గ్రామ పర్యటనలో రోడ్ వైడెనింగ్‌లో జాగా కోల్పోయి ప్రభుత్వ పరిహారం కోసం ఎదురుచూస్తు్న్న ఓ మహిళతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను దగ్గరుండి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు రేవంత్. ప్రస్తుతం ఇల్లుకు సంబంధించిన పనులను స్థానిక కాంగ్రెస్ నేతలు దగ్గరుండి చేయిస్తున్నారు.
వివరాల్లోకెళితే..లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మకు కుండలే జీవనాధారం. కుండలు అమ్ముకున్న జీవనం సాగిస్తున్న ఈ మహిళకు చెందన భూమి రోడ్ వైడెనింగ్‌లో పోయింది. నష్టపరిహారం కింద ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.3 లక్షలు రాలేదు. దాంతో ఆమె పాత ఇంటిలోనే ప్రమాదకర స్థితిలో జీవనం సాగిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఇటీవల రేవంత్‌రెడ్డి సదరు మహిళతో ముచ్చిటించాడు. ఆమె బాధ తెలుసుకున్న రేవంత్ రెడ్డి..అక్కడే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. రోడ్ వైడెనింగ్‌లో ఇల్లు కోల్పోయిన ఎల్లమ్మను ఆదుకోవాలని సూచించారు. ఎల్లమ్మకు ఇల్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం కుమ్మరి ఎల్లమ్మకు సంబంధించిన ఇంటి పనులు జరుగుతున్నాయి. రేవంత్ ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ నేతలు దగ్గరుండి ఎల్లవ్వ ఇంటి పనులు చేయిస్తున్నారు. ఇల్లు గృహప్రవేశానికి రేవంత్‌రెడ్డి వస్తారని, అప్పుడు ఆయనకు చక్కటి భోజనం పెట్టాలని స్థానిక నేతలు ఎల్లవ్వకు చెప్పారు. తప్పకుండా పెడతానని ఎల్లమ్మ సంతోషం వ్యక్తం చేసింది.