సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. ఆర్టీసీ సమ్మె, చలో ప్రగతి భవన్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై పోలీసుల నిర్భంధకాండపై రేవంత్ ఫైర్ అయ్యారు.
మాజీ ఎంపీ అంజన్ యాదవ్, రాములు నాయక్‌ల అరెస్ట్‌పై రేవంత్ రెడ్డి స్పందించారు. వారిద్దరినీ వెంటనే విడుదల చేయాలని… ప్రగతి భవన్, మెట్రో రైల్ గేట్లు మూసుకొని కూర్చున్న కేసీఆర్ ఖబడ్ధార్ అంటూ హెచ్చరించారు. తక్షణమే ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మరికొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి ప్రగతి భవన్‌కు చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరినట్లు సమాచారం. అయితే, ఆయన ఎక్కడ నుండి వస్తున్నారు, ఎలా వస్తున్నారని పోలీసులు డేగ కన్నుతో ఉన్నప్పటికీ…. ఉస్మానియా క్యాంపస్‌కు వచ్చినట్లే ప్రగతి భవన్‌కు చేరుకుంటారని రేవంత్ అనుచరులు ధీమాగా ఉన్నారు.