ప్రగతి భవన్ ను పేల్చేయాలని మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు వరంగల్ జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదులపై రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ బుధవారం మాట్లాడుతూ.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. ప్రగతి భవన్ లోకి ప్రజలకు ఎందుకు ప్రవేశం లేదంటూ నిలదీశారు. అమరవీరుల కుటుంబాలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ పదాన్ని అసహ్యించుకున్న వారంతా ప్రగతి భవన్ లో కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సామాన్య ప్రజలను ప్రగతి భవన్ లోపలికి ఎందుకు రానివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రుల్లో 90 శాతం మంది తెలంగాణ ద్రోహులే అని విమర్శించారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. కోవర్టు ఆపరేషన్ లో మంత్రి ఎర్రబెల్లి ఎక్స్ పర్ట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.